రంగవల్లిక

ప్రేమ ఆవేదన

అమావాస్య చీకటిలో జాబిల్లి వెలుగు కోసం వెతుకుతున్న వెన్నెలలా

కదలని కాలంలో వసంతపు మధురిమకై ఎదురుచూస్తున్న ఎదలయలా

మందార మకరంద మందహాసములో చివరకు మిగిలిన తీయని విషములా

పచ్చని పచ్చికపై ఉద్భవించిన ఊహా సుందరి దరిని చేరలేని సాగరతీరములా


జాలువారు నీలికురుల హొయల కులుకులో ఉప్పొంగి పడిపోయిన సరిగంగపు అలలా

నీలాల చిరునయనాల గుసగుసల కనుచూపుల్లో కునుకుపట్టక కళ్ళు తెరవని కలలా

చిరు అందెల విరజాజి పువ్వు మత్తులో ఊపిరాడక ఆవిరైన  ప్రేమిక మనుగడలా

శ్వేతవర్ణ ధవళకాంతుల మంచుకొండలలో వీరమరణం పొందిన సైనిక ధృవతారలా


నిలిచిపోతాను చరిత్రలో, పార్వతీ వీరప్రేమిక విరహ హృదయ దేవదాసులా

నిశ్వాసమొందువరకు అందని ప్రేమకై, తరగని ఆవేదనతో నిరీక్షించు శ్వాసలా - నీ శ్వాసలా 


                   -  Penned by Sreeni (S. Anil Kumar)







0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]

<< హోమ్