రంగవల్లిక

హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్

ఇప్పుడే ఉదయించిన జగనుడికి పోటీగా వీస్తున్న పవనము లా

పదికోట్ల ఆంద్రుల శ్వాస నుండి వెల్లువెత్తిన ఆక్సిజన్ సిలిండర్ లా

కులజాడ్యపు విధానాల బలినుండి కాపు కాచు కాపు జాతి గీతంలా

అమరావతి రైతు హృదయ వేదనలో ఉప్పొంగిన ఆక్రందన నదిలా


ఆవేదనతో రగులుతున్న నిరుద్యోగ గుండెచప్పుళ్ల రక్తపు ప్రతిధ్వనిలా

ఈ రక్తపు బడబాగ్నిలో ఎగిసిన మరో సీమాంద్ర ఉద్యమ జ్వాలలా

ఆ జ్వాలలో ఉవ్వెత్తున నింగికెగసిన అగ్ని పర్వతపు శిఖరంలా

లోకకళ్యాణమే ఊపిరిగా ఉద్యమించిన జనసైనిక ఉగ్రసింహంలా


కొత్త రాష్ట్ర పురిటి నొప్పుల  మళ్ళీ ఉదయించిన రాజకీయ సూరీడు

సినీ భక్తుల పాలిట మరో భగవంతుడు మన చిరు సోదరుడు

మహా ప్రస్ధానమును తిరిగి లిఖిస్తున్న మన జన సేన నాయకుడు

జన ప్రభంజనానికి మరో పేరు పవర్ స్టార్ -  వీడొక పొలిటికల్ మాన్ స్టర్

హ్యాపీ హ్యాపీ బర్త్ డే టు యూ పవర్ స్టార్ - నువ్వే మా కాబోయే చీఫ్ మినిస్టరు


-                                      Penned by S Anilkumar



0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]

<< హోమ్