అలుపెరుగని యోధుడు - మరో సూర్యుడు
జిలిబిలి వెలుగుల నక్షత్రాల మధ్య 'చంద్రకాంతి' ని విరజిమ్మే చందమామను ప్రతి క్షణం ప్రజలు ఆస్వాదిస్తారు. కానీ అంతకంటే కాంతివంతమైన రవితేజం మాత్రం సూర్యోదయం, సూర్యాస్తమయం లోనే ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఎవరు గుర్తించినా, గుర్తించకపోయినా సూర్యుడు మాత్రం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అలుపెరగకుండా మనకు వెలుగుని పంచుతూ తన పనిని తను చేసుకుపోతాడు. అటువంటి అలుపెరుగని యోధుడిగా భారత క్రికెట్ లో వెలిగిన మరో సూర్యుడే "అనిల్ కుంబ్లే".
క్రికెట్ క్రీడారంగం లో ఎందరో బౌలర్లు రాణించారు. విశ్లేషకులు వారిని ఫాస్ట్ బౌలర్లగానో, మీడియం పేస్ బౌలర్లగానో లేక స్పిన్నర్లగానో విభజించారు. వీటన్నింటిని కలిపి లేక వీరందరికీ విభిన్నంగా మీడియం పేసర్ లాగా గంటకు 90 కిమీల వేగంతో, ఫాస్ట్ బౌలర్లకే సొంతమిన బౌన్స్ తో, బాట్ మధ్యభాగానికి మరియు ఎడ్జ్ కి మద్య ఉన్న కొద్ది గ్యాప్ కి సరిపోయేంత స్పిన్ నీ ఏకకాలంలో రాబట్టిన ఏకైక స్పిన్ మాంత్రికుడు అనిల్ కుంబ్లే ఒక్కడే. ఒకే ఇన్నిగ్స్ లో పది వికెట్లను పడగొట్టిన రెండవ బౌలర్ కుంబ్లే మాత్రమే.
కంటద్దాలతో తను భారత క్రికెట్ లో అడుగుపెట్టిన తొలినాళ్ళలో ఇతను స్పిన్ చేయలేడు...రెండు లేక మూడు సంవత్సరాల కన్నా ఎక్కువ ఆడలేడని బంతిని మెలికలు తిప్పే ఎందరో స్పిన్నర్లు ( కొద్ది మంది భారత క్రీడాకారులు కూడా) వ్యాఖ్యానించారు. విరోచితమైన పోరాటపటిమ, అచంచలమైన ఆత్మవిశ్వాసం, అకుంఠితమైన దీక్ష, అపారమైన విశ్లేషణా జ్ఞానం, వల్లమాలిన అంకితభావం, అంతకుమించి అనిర్వచనీయమైన దేశ భక్తి కలగలిసిన కుంబ్లే ఆ విమర్శలకు వెరవక గత పద్దెనిమిది సంవత్సరాలుగా తన పనిని తను చేసుకొంటూ పోయాడు. ఈనాడు ప్రపంచంలోనే అత్యధిక వికెట్లు తీసిన ముడో బౌలర్ గా చరిత్ర పుటలలో నిలిచాడు.
సచిన్, ద్రవిడ్, గంగూలీ మరియు కపిల్ లాంటి స్టార్ల లాగా ఎంతో క్రేజ్ ని కూడగట్టుకోకపోయినా, వారందిరినీ మించి భారతదేశానికి టెస్ట్ విజయాలు సాధించాడు. కానీ తన బౌలింగ్ ని చేల్చి చెండాడిన మేటి బాట్స్మన్ పై తను వ్యూహాలు రచించానని ఇక వారిని ఔట్ చెయ్యడం సులువు అని ఏనాడు కోతలు కోయలేదు. లేదా తనకు కలలో కూడా ఆ బ్యాట్స్ మెన్ వస్తున్నాడని వ్యాఖ్యానించలేదు ఎందుకంటే కలలో కుడా తనను తను తక్కువ చేసుకోకుండా మొక్కవోని పట్టుదలతో పోరాడుతుంటాడు. అతనొక పట్టువదలని విక్రమార్కుడు. భారత మాజీ కెప్టన్ సౌరవ్ గంగూలీ ఒకసారి కుంబ్లే పోరాట పటిమ గురించి ఇలా చెప్పాడు. ప్రత్యర్థి జట్టు 250/1 స్కోర్ తో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బౌలర్ కోసం మైదానం లో వెతుకుతుంటే ఒక వ్యక్తి మాత్రం తననే చుస్తూ ఉంటాడంట, తనకు బౌలింగ్ ఇవ్వాలని. అతను మరెవ్వరో కాదు - కుంబ్లే నే. బాల్ తరువాత బాల్, ఓవర్ తరువాత ఓవర్ వేస్తూనే ఉంటాడు. అతనొక నిత్య విద్యార్థి. ఒకానొక దశలో కుంబ్లే లేకుండా భారత టెస్ట్ విజయాన్ని ఉహించడం కూడా కష్టమే అనడం అతిశయోక్తి కాదేమో. ముఖం నిండా బ్యాండేజ్ లతో మైదానం లోకి అడుగుపెట్టి చకచకా మూడు వికెట్లు తీసి కరేబియన్ దీవుల్లో భారత్ ను విజయానికి చేరువలో చేర్చిన ఘట్టాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు.
తన కెరీర్ చివరి భాగం లో అనిల్ కుంబ్లే తన చిరకాల స్వప్నమైన టెస్ట్ సెంచరీని పూర్తి చేసాడు. వివాదాస్పదమైన ఆస్ట్రేలియా సిరీస్ లో భారత జట్టు క్రీడాస్పూర్తిని హుందాగా ప్రపంచానికి చాటి చెప్పిన కెప్టెన్ కుంబ్లే. ప్రతి మ్యాచ్ లో విజయమే తన లక్ష్యంగా ఆడిన కుంబ్లేకి దురదృష్టం కొద్దీ ఎంతో పేరు దక్కలేదు. కొందరు తన రిటైర్మెంట్ గురించి ఎంతో విమర్శించారు. చిట్టచివరకు వివాదాలకు దూరంగా తనకే సొంతమైన హుందాతనంతో 619 వికెట్ల వద్ద నవంబర్ 2 వ తేదీ రవివారం సూర్యాస్తమయమునకు తన రిటైర్మెంట్ ప్రకటించాడు. సూర్యాస్తమయం తరువాత మరలా 12 గంటలకు సూర్యుడు మళ్ళీ ఉదయిస్తాడన్న నమ్మకంతో ప్రపంచమంతా సంతోషంగా నిద్రిస్తుంది. మరి 'సుప్రజా'నీకాన్ని తన ఆటతీరుతో అలరించే భారత క్రికెట్ 'తేజ'ము, మరో అనిల్ మరో పన్నెండు సంవత్సరాలకు గానీ లేక కనీసం మరో పన్నెండు దశాబ్దాలకు గాని ఆవిర్భావిస్తాడో లేదో.. 620 వికెట్లు తేసే మరో స్పిన్ బౌలర్ ఐతే దొరుకుతాడేమో కానీ, అనిల్ కుంబ్లే లాంటి జెంటిల్మన్ క్రీడాకారునికోసమైతే శాశ్వతంగా వేచి చూస్తూనే ఉండాలేమో!
కుంబ్లే రిటైర్మెంట్ సందర్భంగా తనకు సదా మంచి జరగాలని ఆ భగవంతున్ని కొరుకుంటూ..
మీ అనిల్ - కుంబ్లే అభిమాని

లేబుళ్లు: ఇంద్రధనస్సు

1 కామెంట్లు:
hi..
really nice post...
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్స్క్రయిబ్ చేయి కామెంట్లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్