నా తండ్రి శ్రీనివాసుడా
ఏడూకొండలపై వెలసిన ఓ స్వామి వేంకటేశుడా
మము రక్షించ తిరిగి రావా నా తండ్రి శ్రీనివాసుడా
ముల్లోకములనూ ఏలేటి మహదేవ దేవదేవుడా
ఈ భూలోకమును కాపాడరావా నా తండ్రి శ్రీనివాసుడా
హరితవనమున విహరించు శ్రీలక్ష్మీ వల్లభుడా
ఈ మానవ సంహారమును అరికట్టరావా నా తండ్రి శ్రీనివాసుడా
తేజో విహాసమైన వచస్సుతో వికసించిన దివ్య శ్రీనివాసుడా
ఈ విశ్వమున వెలుగు నింపరావా నా తండ్రి శ్రీనివాసుడా
సహస్ర సిరులను ప్రాప్తించు విజయలక్ష్మీ శ్రీనివాసుడా
సుప్రజానీకానికి సిరి సంపదలనొసగు నా తండ్రి శ్రీనివాసుడా
ఆపదమొక్కులను తీర్చేటి మా స్వామి గోవిందుడా
ఈ కరోనా కష్టాలు ఆపరావా నా తండ్రి శ్రీనివాసుడా

0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్