మార్చుకో నీ దిశను ప్రతి దశలో
ఇప్పుడే మొలకెత్తిన ఓ చిగురుటాకా
అతి అల్లరితో మారాం చేయబోకు
పదహారేళ్ళకు తుళ్ళిపడేటి తమలపాకా
అతిఊహలతో భంగపడి కరగమాకు
ముప్పదిలో అడుగిడిన గోరింటాకా
అతిగా ఆశపడి రంగులలోకంలో మోసబోకు
అర్ధ శతకాన విస్తరించిన విస్తరాకా
అతిగా బంధనాల బాధపడి ఆవిరవమాకు
ఎనుబదిలో కదలలేని పండుటాకా
వడివడి అడుగులతో మిగిలేది ఎండుటాకే
ఇకనైనా గుర్తించు, ఉన్నాను నేను నీకు
ఆ పరమాత్ముని రూపంలో, చేరువుగా నీ ఆత్మకు
పైనుండి దీవిస్తూ, నీలోని అంతరాత్మగా
నిజానికి నీ లోన, దూరంగా నీ ఆశలకు
మొలకెత్తిన చిగురుటాకు నుండి ఎండుటాకు దాకా
అర్ధం చేసుకో నన్ను నీ ప్రతి అడుగులో, ప్రతి దశలో
బ్రతుకు పండి నాలోకి చేరేదాకా మార్చుకో నీదిశను

0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్