సలాం తల్లీ
ఆడ పిల్లవో ఈడపిల్లవో నువు యాడ పిల్లవో
పుట్టింటికి మెట్టింటికి మద్యన పురిటింటి బంగారు తల్లివో
అతి ఆచారాలు అత్యాచారాలలో నలుగేటి పంచదార చిలకవో
నిర్దయపు రాక్షస లోకమున భయములో జీవిస్తున్న నిర్భయవో
యమపాశమును అడ్డుపడి పతి ప్రాణం పోసిన సతి సావిత్రివో
అష్టకష్టాలను చిరునవ్వుతో స్వీకరించిన ఆదర్శ ధరణీజ సీతమ్మవో
కుటుంబబాద్యతను సహనంతో మోసేటి సాహితీ లక్ష్మీ భారతివో
స్వాతంత్రోద్యమాన నేలకొరిగిన భరతమాత ముద్దుబిడ్డ ఝాన్సీ రాణివో
ఆడుకొను ఈడపిల్ల నుంచి ఈడు వచ్చిన ఆడపిల్ల వరకు
అలుపెరుగని నీ సేవలకీ, గుర్తించని అపురూప ప్రేమకి
తల్లిగా చెల్లిగా అనురాగవల్లిగా కుటుంబ సిరినొసగు సిరిమల్లెకు
మానవజాతి నిర్మాణ సమెధకు అందుకో సలాం తల్లీ
- Penned by Sreeni (S. Anil Kumar)

0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్