ఏం జరుగుతోంది
మనిషి మనిషికి మద్యన అడ్డుగోడ నిర్మించిన మానవలోకమా
కులమతజాతి విద్వేషాలతో గుండె రగులుతున్న దానవకులమా
వర్గాలుగ స్కీముస్కాములతో విభజించిన అగ్రవర్ణ రాజకీయ కబంధమా
ఆకలివాకిలిటి చీకటిలో కలసిమెలసి జీవించుట మరచిన కలికాలమా
అన్నదమ్ములే ఉత్తరదక్షిణ ధృవములై అంతరిస్తున్న ఉమ్మడి కుటుంబమా
కులాంతర బంధనాలు సృష్టించిన ప్రగతిసాధక ప్రతిబంధకమా
ఒకరాష్ట్ర ఆనకట్టు పక్కరాష్ట్ర అడ్డుకట్టగా విస్తరించిన భారతదేశమా
అక్షాంశ రేఖాంశ రేఖలుగా ఖండఖండాలుగ విడిపోతున్న భూమద్యశాఖలా
ఏంజరుగుతుంది అసలేం ఒరుగుతుందీ, అంతర్మధనము చేద్దామా ఇకనైనా
అంతర్యామి ఆంతర్యమును గుర్తెరిగి అంతరిస్తున్న సృష్టిని కాపాడుకుందామా
ప్రేమించుటయే సృష్టిధర్మమని సమైక్య మానవజాతి మనుగడను పునర్నిర్మించెదమా
మన తిరుపతి వెంకన్నస్వామి, గొలగమూడి వెంకయ్యస్వామి సూక్తులను పాటించెదమా
ఆకలై కొంగుపట్టేవారికి అన్నం పెట్టాలయ్యా! ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలయ్యా!
- Penned by Sreeni (S. Anil Kumar)

0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్