జై శ్రీరామ్
మాటా మాటా, చెప్పనా ఈ పూట నా మనసులోని మాట
మెగా మైకులో పెద్దగా వినిపించమన్న ముత్యాల మంచి మాట
చిరు చెవిలో చిన్నగా చెప్పమన్న రాగద్వేషాల చెడ్డ మాట
ఆ నోట ఈ నోట పాకేసి పారేటి సెలయేటి నీటిమూట మన నోటిమాట
భగవంతుడు భక్తునికి ఉపదేశించు సూక్తి మాట
తిరిగి ఆ భక్తుని నోటి వెంట పొంగి పొరలు భక్తి పాట
బడిపంతులు విద్యార్ధికి నేర్పించు చదువుల మూట
మన బ్రతుకు దారికి వేసిన ఓ బంగారు రాచబాట
భక్తి ధర్మ మార్గములు విరజిల్లు చోట బ్రతుకు ఓ బంగారు పూలతోట
నవాబుల డబ్బుమూటల కన్నా బలముగా నుండు గరీబుల బ్రతుకు పాట
రాచరికపు రాజులకోటలో కన్నా భద్రముగా నిదురించు నిరుపేదల పేట
ధర్మమెరిగి మాట నిలుపుకొన్న చోట ఆ శ్రీరాముడు కొలువై రక్షించు అన్నింట
అండ పిండ బ్రహ్మాండ లోకములలో సాటిలేని కోదండరాముడు నిలబెట్టుకొన్న తండ్రి మాట
శతకోటి భక్తకోటి అవిరామ లిఖిత రామకోటి ప్రేరిత ఘనాపాటి శ్రీరాముని ఆదర్శ బాట
నరరూపములో అవతరించిన ఆ శ్రీరాముని మాటల బాటల గురుతు మన అయోధ్యా కోట
ఆ అయోధ్యారామ జన్మభూమి మన వేదభూమిలో ఉద్భవించిన భరతదేశపు మహాశక్తి మంత్రం
కులమతసయోధ్యా రామరాజ్యపు చిహ్నముగా ప్రతి భారతీయుడు స్మరించవలసిన దివ్య స్తోత్రం - జై శ్రీరామ్
- Penned by Sreeni (S. Anil Kumar)

0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్