రంగవల్లిక

జై శ్రీరామ్

మాటా మాటా, చెప్పనా ఈ పూట నా మనసులోని మాట

మెగా మైకులో పెద్దగా వినిపించమన్న ముత్యాల మంచి మాట

చిరు చెవిలో చిన్నగా చెప్పమన్న రాగద్వేషాల చెడ్డ మాట

ఆ నోట ఈ నోట పాకేసి పారేటి సెలయేటి నీటిమూట మన నోటిమాట


భగవంతుడు భక్తునికి ఉపదేశించు సూక్తి మాట

తిరిగి ఆ భక్తుని నోటి వెంట పొంగి పొరలు భక్తి పాట 

బడిపంతులు విద్యార్ధికి నేర్పించు చదువుల మూట

మన బ్రతుకు దారికి వేసిన ఓ బంగారు రాచబాట


భక్తి ధర్మ మార్గములు విరజిల్లు చోట బ్రతుకు ఓ బంగారు పూలతోట

నవాబుల డబ్బుమూటల కన్నా బలముగా నుండు గరీబుల బ్రతుకు పాట

రాచరికపు రాజులకోటలో కన్నా భద్రముగా నిదురించు నిరుపేదల పేట

ధర్మమెరిగి మాట నిలుపుకొన్న చోట ఆ శ్రీరాముడు కొలువై రక్షించు అన్నింట


అండ పిండ బ్రహ్మాండ లోకములలో సాటిలేని కోదండరాముడు నిలబెట్టుకొన్న తండ్రి మాట

శతకోటి భక్తకోటి అవిరామ లిఖిత రామకోటి ప్రేరిత ఘనాపాటి శ్రీరాముని ఆదర్శ బాట

నరరూపములో అవతరించిన ఆ శ్రీరాముని మాటల బాటల గురుతు మన అయోధ్యా కోట

ఆ అయోధ్యారామ జన్మభూమి మన వేదభూమిలో ఉద్భవించిన భరతదేశపు మహాశక్తి మంత్రం

కులమతసయోధ్యా రామరాజ్యపు చిహ్నముగా ప్రతి భారతీయుడు స్మరించవలసిన దివ్య స్తోత్రం - జై శ్రీరామ్

                                       

                   -  Penned by Sreeni (S. Anil Kumar)








లక్ష్మీ వర ప్రదాయణీ ఇంద్రాక్షీ దేవి

అమ్మా అమ్మా అని పిలవగానే మా మొరను ఆలకించి పలికేటి ఇంద్రాక్షమ్మా

చుంచులూరు గ్రామమున కంచిపీఠాధిపతి ప్రతీష్టించిన ఓ శక్తి స్వరూపిణీ

నీ దివ్య శక్తులతో మము కరుణించి కాపాడవమ్మా శైలజాదేవీ రూపిణీ 

నా తనువు నా మనసు నా శక్తి  నా సర్వస్వము జగన్మాతయగు నీవేనమ్మా


పాహిమాం దేవీ పాహిమాం, ప్రసన్నవదనా నానాలంకార భూషితా 

వామహస్తమున వజ్ర ధారితా, దక్షిణహస్తమున భక్తవర ప్రదాతా

పాహిమాం దేవీ పాహిమాం, ద్వయ పీతవస్త్రథరితా మప్పరోగ నివారితా


కరుణించుమాతా కరుణించుదేవీ కరుణించుమా మమ్ము కరుణించుమా

దీవించుమాతా దీవించుదేవీ దీవించుమా మమ్ము దీవించుమా

వరలక్ష్మీ వ్రత దినోత్సవమున పొంగల్లనర్పించు భక్త సందోహమును

ఆశీర్వదించుమా సౌభాగ్య లక్ష్మీ వర ప్రదాయణీ ఇంద్రాక్షీ దేవీ।।


                - Penned By Srini (S.Anilkumar)














కోనేటి ఈశ్వరా - శ్రీ కోనేటయ్య స్వామీ

కార్తీక ఏకాదశి పూజలతో చతుర్మాస కష్టములను శుభప్రదము గావించు శ్రీమహా విష్ణువులా

మహా శివరాత్రి జాగరణతో అజ్ఞాన అంథకారములను తొలగించి దీవించు మహేశ్వరునిలా

మాఘ పౌర్ణమిన జీవసమాధియై బోయనపల్లెవాసుల రక్షించు శ్రీ కోనేటయ్య స్వామీ

ఆ శ్రీ వేంకట నారాయణుని మదిలోన వెలసిన ఓ కోనేటి ఈశ్వరా


సంతానప్రాప్తికై మొక్కిన పోలగంగు విజయుడుగారికి పుత్రున్ని ప్రసాదించిన కరుణామయా

పుట్టినబిడ్డలు మూగవారిగా కాకుండా పిల్లలభూతాన్ని కట్టడించిన ఓబయ్యగారి వంశవృక్ష ప్రదాతా

వేంకటసుబ్బారెడ్డి గారింట దయ్యాన్ని తరమగొట్టి కోనేటిరెడ్డికి జన్మనిచ్చిన ఓ స్వామీ

కలిశెట్టి రత్తమ్మ గారి జబ్బును పారద్రోలి మరుజన్మ నిచ్చిన శ్రీ కోనేటయ్య స్వామీ


అర్దరాత్రి గుడిలోన హారతిని వెలిగించి కనిపించని భక్తతేజములా

గజ్జెల సందడితో ఆలయాన సంచరించు అదృశ్యపు దివ్యశక్తిలా

మంత్రశక్తితో ఉన్నఊరి నుండే కాశీయాత్ర చూపించిన అవధూతలా

జీవసమాధినుంచి మము ఓ కంటకనిపెట్టి కాపాడు మా స్వామి

శ్రీశ్రీశ్రీ వడ్డమాని కోనేటయ్య స్వామివారికి శతకోటి నమస్కారాలతో 


                     -  Penned by Sreeni (S. Anil Kumar)




ప్రేమ ఆవేదన

అమావాస్య చీకటిలో జాబిల్లి వెలుగు కోసం వెతుకుతున్న వెన్నెలలా

కదలని కాలంలో వసంతపు మధురిమకై ఎదురుచూస్తున్న ఎదలయలా

మందార మకరంద మందహాసములో చివరకు మిగిలిన తీయని విషములా

పచ్చని పచ్చికపై ఉద్భవించిన ఊహా సుందరి దరిని చేరలేని సాగరతీరములా


జాలువారు నీలికురుల హొయల కులుకులో ఉప్పొంగి పడిపోయిన సరిగంగపు అలలా

నీలాల చిరునయనాల గుసగుసల కనుచూపుల్లో కునుకుపట్టక కళ్ళు తెరవని కలలా

చిరు అందెల విరజాజి పువ్వు మత్తులో ఊపిరాడక ఆవిరైన  ప్రేమిక మనుగడలా

శ్వేతవర్ణ ధవళకాంతుల మంచుకొండలలో వీరమరణం పొందిన సైనిక ధృవతారలా


నిలిచిపోతాను చరిత్రలో, పార్వతీ వీరప్రేమిక విరహ హృదయ దేవదాసులా

నిశ్వాసమొందువరకు అందని ప్రేమకై, తరగని ఆవేదనతో నిరీక్షించు శ్వాసలా - నీ శ్వాసలా 


                   -  Penned by Sreeni (S. Anil Kumar)







ఏం జరుగుతోంది

మనిషి మనిషికి మద్యన అడ్డుగోడ నిర్మించిన మానవలోకమా

కులమతజాతి విద్వేషాలతో గుండె రగులుతున్న దానవకులమా

వర్గాలుగ స్కీముస్కాములతో విభజించిన అగ్రవర్ణ రాజకీయ కబంధమా

ఆకలివాకిలిటి చీకటిలో కలసిమెలసి జీవించుట మరచిన కలికాలమా


అన్నదమ్ములే ఉత్తరదక్షిణ ధృవములై అంతరిస్తున్న ఉమ్మడి కుటుంబమా

కులాంతర బంధనాలు సృష్టించిన ప్రగతిసాధక ప్రతిబంధకమా

ఒకరాష్ట్ర ఆనకట్టు పక్కరాష్ట్ర అడ్డుకట్టగా విస్తరించిన భారతదేశమా

అక్షాంశ రేఖాంశ రేఖలుగా ఖండఖండాలుగ విడిపోతున్న భూమద్యశాఖలా


ఏంజరుగుతుంది అసలేం ఒరుగుతుందీ, అంతర్మధనము చేద్దామా ఇకనైనా

అంతర్యామి ఆంతర్యమును గుర్తెరిగి అంతరిస్తున్న సృష్టిని కాపాడుకుందామా

ప్రేమించుటయే సృష్టిధర్మమని సమైక్య మానవజాతి మనుగడను పునర్నిర్మించెదమా

మన తిరుపతి వెంకన్నస్వామి, గొలగమూడి వెంకయ్యస్వామి సూక్తులను పాటించెదమా

ఆకలై కొంగుపట్టేవారికి అన్నం పెట్టాలయ్యా! ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలయ్యా!


                   -  Penned by Sreeni (S. Anil Kumar)








సలాం తల్లీ

ఆడ పిల్లవో ఈడపిల్లవో నువు యాడ పిల్లవో 

పుట్టింటికి మెట్టింటికి మద్యన పురిటింటి బంగారు తల్లివో

అతి ఆచారాలు అత్యాచారాలలో నలుగేటి పంచదార చిలకవో

నిర్దయపు రాక్షస లోకమున భయములో జీవిస్తున్న నిర్భయవో


యమపాశమును అడ్డుపడి పతి ప్రాణం పోసిన సతి సావిత్రివో

అష్టకష్టాలను చిరునవ్వుతో స్వీకరించిన ఆదర్శ ధరణీజ సీతమ్మవో

కుటుంబబాద్యతను సహనంతో మోసేటి సాహితీ లక్ష్మీ భారతివో

స్వాతంత్రోద్యమాన నేలకొరిగిన భరతమాత ముద్దుబిడ్డ ఝాన్సీ రాణివో


ఆడుకొను ఈడపిల్ల నుంచి ఈడు వచ్చిన ఆడపిల్ల వరకు

అలుపెరుగని నీ సేవలకీ, గుర్తించని అపురూప ప్రేమకి

తల్లిగా చెల్లిగా అనురాగవల్లిగా కుటుంబ సిరినొసగు సిరిమల్లెకు

మానవజాతి నిర్మాణ సమెధకు  అందుకో సలాం తల్లీ


                   -  Penned by Sreeni (S. Anil Kumar)






మనీ షి

మనీ షి ల మద్యన మనసు మూగబోయిన ఓ మూగ మగ మగడా

ఆసులాటి నీవు హోము ఆపీసు నడుమ ఊసులేని త్రాసువైన బాసూ

గలగలల నీ గళము ఇంతిగోల తాళలేక గిలగిలలాడి గొల్లుమనెనా గరీబూ

రాజులా కొట్టిన పోజు ఇంటిగోల వేగలేక బూజు పట్టిన గిరాజువైన మహరాజా


క్లబ్బులు పబ్బులంటు తిరిగిన నీమబ్బులిక వీడెనా గండడా

పోరులెంట పొర్లిన నీపొగరు పడతిపోరులో పారిపోయ్యెనా పురుషా

హనీ మనీల ఆశలన్ని హనీమూనులో ఆవిరయ్యెనా ఓ మనిషీ

ఆడతనపు అమ్మకాన కమ్మనీ అమ్మప్రేమ మరిచితివా మరమనీషి


టైము లేదు మిత్రమా, ఇకనైనా మేలుకో అన్నిటిని సరిచూసుకో

ఈశ్వర శరణముతో రూటుమార్చుకుంటే ఏ రణమునైనా

బాస్, యు విల్ బి బ్యాక్ విత్ ఏ బ్యాంగ్

ఆ శివశంకర వర ప్రసాదముతో  చరితకెక్కిన చిరంజీవిలా


                   -  Penned by Sreeni (S. Anil Kumar)