రంగవల్లిక

పుత్ర శోకం

ఓరోరి జ్యోతి పుత్రుడా నీ జాడ ఏడనో తెలుపరా

నీ రాకకై దిగులుతో ఆరిపోయేనా నా జీవనజ్యోతి 

ఓ క్రిష్ణ సుతుడా నేనెక్కడ ఎక్కడని వెతికేనురా

శ్రీకృష్ణ తనయులలా చివరిచూపుకు కూడా ఉండవా


ఓ శాంతి సోదరుడా నీవెపుడు ఇంటికి వస్తావురా

తిరిగొచ్చి మా జీవితానికి మనశ్శాంతిని ప్రసాదించరా

ఓ కిరణ కుమారుడా నీవెందుకు చీకటిలో దాగావురా

మా ఇంటి వెలుగై ఆశా కిరణంలా వందేళ్లు జీవించురా 


కంటికి కనపడని ఓ భగవంతుడా దాగుడుమూతలు ఆపవా

మా కన్న బిడ్డని మా ఇంట చేర్చి కడసారి ఒకసారి చూపించవా

మోక్షాన్నిచ్చే ఓ దేవదేవుడా పైలోకం చేరే భాగ్యాన్ని ప్రసాదించవా 

ఈ పుత్రశోకం నేనోర్వలేను ఆ పైనుండి ఒకసారి చూసి తరించనీవా


మా అక్క కీ.శే. శ్రీ గ్రందే జ్యోతి గారి జ్ఞాపకాలతో 

              -  Penned by Sreeni (S. Anil Kumar)

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]

<< హోమ్