మా నాన్న “చిరంజీవి”
దగ్గరగా ఉన్నప్పుడు వద్దని దూరంగా పక్కకు జరిగినా
దూరమైనపుడు దగ్గరకాలేదని బిగ్గరగా మధనపడినా
చిన్నప్పుడు తన్నులు తిన్నప్పుడు బాధతో కసురుకున్నా
కాటికే చేరినపుడు అదేకాలి దగ్గర కన్నీరుమున్నీరుగా రోదించినా
మహా శివరాత్రి పర్వదినాన శివైక్యమైన పరమశివుడిలా
సక్రమ మార్గాన్ని నిర్దేశించే జీవన గీతా బోధక శ్రీకృష్ణుడిలా
కొండంత ఆత్శ విశ్వాసాన్ని పెంచే వీర హనుమంతుడిలా
మొక్కకుండానే ఆపదలను తీర్చే నా తండ్రి శ్రీనివాసుడిలా
నా ఆకారంలో వెలసిన నకారపు మమకారం నాన్న
మనలో గుణకారాన్ని హెచ్చించిన భాగహారం నాన్న
కలకలలాడే జీవిత గాలిపటపు ఆధార దారం నాన్న
పరమాత్మ అందించిన రెండు అక్షరాల మణిహారం నాన్న
యాబైఆరు అక్షరాలతో వర్ణించలేని అపార ప్రేమజీవి నాన్న
కష్టాలను మింగి కన్నీళ్లను దిగమింగిన కర్మజీవి నాన్న
ఆత్మసాక్షిగా నాకై శ్రమించి విశ్రమించిన శ్రమజీవి నాన్న
అందుకే నా అంతరాత్మకు ఎప్పుడూ మా నాన్న చిరంజీవే
21 సం క్రితం పరమపదించిన మా నాన్నకి అశ్రు నివాళి
- Penned by Sreeni (S. Anil Kumar)

0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్