గాన గంధర్వ బాలుడు
సంగీతపాఠాలు నేర్వని పండితారాధ్యుల గాన గంధర్వుడు
పదహారు భాషలలో నలువది వేల పాటల గాన ఆంధ్రుడు
తెలుగు భాష కొమ్మపై గూడు కట్టిన మరో ఘంటసాల ఇతడు
తెలుగు జాతి కి గర్వకారణమైన భారతీయ పద్మ భుాషణుడు
గొంతు శ్రుతిగా గుండె లయగా పాడి పరవశింపచేసిన చిత్ర-బాలుడు
సాగరసంగమపు శ్రుతిలయల శంకరాభరణపు విశ్వనాధ ఆస్ధానుడు
వెన్నెల పైటలో కిన్నెరసాని సితారని కీర్తించిన సాహితీ భావకుడు
సంగీతరారాజు ఇళయరాజుతో జతకట్టి శ్రీశ్రీ గొంతు విప్పిన వీణారుద్రుడు
చరణ పల్లవులకు తండ్రిగా ప్రాణం పోసిన పాటల మాంత్రికుడు
పాడుతా తీయగా చల్లగా అంటూ కొత్త గొంతుకల ప్రోత్సాహకుడు
గానకళకు వన్నెతెచ్చి కళకళలాడించిన సకలకళా వల్లభుడు
సామజవరగమన కే గొంతు ధారపోసిన తెలుగు గాన పోషకుడు -
శ్రీ శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం (SPB) గారికి అశ్రునివాళి
- Penned by Sreeni (S. Anil Kumar)
