గురవే నమః
మా అజ్ఞానపు చీకట్లను తొలగించి జీవన గతిని నిర్దేశించిన విజ్ఞానదాత
అవతార పురుషులకు సైతం అసమాన ధర్మాన్ని ప్రబోధించిన విధాత
రాయి లాంటి మనుషులను అందమైన శిల్పాలుగా మలిచిన అసమాన శిల్పి
గమ్యము లేని గాలి జీవితాలకి మార్గనిర్దేశం చూపిన మహనీయ మహర్షి
శిష్యులను ప్రవృత్తిలో నిలిపి తప్పులను సరిదిద్దే వృత్తిలో నిరంతర శ్రామిక
విద్యార్ధుల భవిష్యత్తుకు బంగారు బాటలేసిన గాలిపటపు ఆధారపు దారమా
జ్ణానాన్ని సృష్టించిన బ్రహ్మ విజ్ఞానాన్ని వికసింపచేసిన విష్ణు అజ్ఞానాన్ని మసిబాపిన మహేశ్వరుడు
అమ్మలా మనసున వెన్న నాన్నలా గుణమున మిన్న విద్యా దానముతో దాతృత్వమున సాటిలేని దేవుడు
మాతా పితా దైవపు త్రిస్వరూప త్రిమూర్తుల కలయికగా ప్రత్యక్షముగా కనిపించు మహనీయుడు
గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరహః గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మైశ్రీ గురవే నమః
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్