తగ్గేదే లే - హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్
బడుగులను కాపాడే చట్టాలన్నీ ధనికుల చుట్టాలుగ మారుతుంటే
ప్రజలను రక్షించే రాజ్యాంగము పాలిస్తున్న రాజులకే మంచి చేస్తుంటే
ముద్దాయిలు ఏ1 ఏ2 లే పరిపాలించే ముఖ్యమంత్రులవుతుంటే
ప్రజాస్వామ్య ముఖ్యమంత్రి పదవి వారసుల హెరిటేజుగా మారుతుంటే
సవాలు చేయ వస్తున్నాడు ఈ నకీలు సాబుల వాకబు చేసే వకీలుసాబు
వారసత్వపు పొలిటికల్ మనీ పవరుని సవాలు చేసే మా పవర్ స్టారు
భగభగమండిన ప్రజాగ్రహమున పుట్టిందీ గాజు గ్లాసు పార్టీ
తిరుగులేని జన సైనిక ప్రభంజనమునకు ఇక లేదు పోటీ
సినీ టికెట్ రేటు తగ్గించినా మా కలెక్షన్ పవర్ స్టారు దాటి
తగ్గేదేలే అంటున్న మెగా పల్స్ రేటు ముందు తనకు లేరు సాటి
కాచుకోండిక చూసుకోండి ఉరిమిఉరిమి దూసుకొస్తున్న చిచ్చర పిడుగులను
ఉచిత పథక రాజులను తరిమితరిమి కొట్టడానికి వస్తున్న జనసైనిక అడుగులను
అడుగు అడుగునా అవినీతి పరిపాలనను కడిగికడిగి తుడిచేటి చెగువీరాలను
అడుగు అడుగు విస్తరించి విశ్వమంతా వ్యాపించిన వామనులను
ప్రజాగ్రహమున జనియించిన జనసైనికులే పది కోట్ల చిరంజీవులుగా
పంజా విప్పిన కొమరం పులిలా వస్తున్నాడు హరిహరాదులు మెచ్చిన వీరమల్లు
ప్రజాజ్వళమును గళముగా విప్పిన జనసేనా గణమునకు అధినాయకుడు
వికటించిన జగనుడి వేడినుంచి ప్రజలకు ఉపశమనాన్నిచ్చే పవనుడు
తగ్గేదే లే ఇక తగ్గేదే లే, పవరు కోసం పవర్ ఫుల్ గా వస్తున్నాడిక మా పవర్ స్టార్
హ్యాపీ హ్యాపీ బర్త్ డే పవర్ స్టార్, ఇక నువ్వే మా కాబోయే చీఫ్ మినిస్టర్
- Penned by Sreeni (S. Anil Kumar)
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్