శ్రీ విద్యారణ్య విద్యా మందిర్ హైస్కూల్
విద్యారణ్యమునే విద్యా మందిరంగా తీర్చిదిద్దిన విద్యా ప్రదాతలు వీరు
చరిత్రలేని మాకు చరిత్రలో చోటు కల్పించిన అపర మేధావులు మీరు
అజ్ణానమును తొలగించి విజ్ణానమును అందించిన సరస్వతీ పుత్రులు సారు
మా రాతలను సరిచేసి తలరాతలను మార్చిన బ్రహ్మ పుత్రులు మాస్టారు
భౌతిక గ్రహ గతులను వివరించి మా జీవన గతినే ఉత్తమ స్థితికి చేర్చిన వెంకటేశ్వర్లు సార్
గతి తప్పిన జీవన రేఖలను క్రమశిక్షణ నేర్పించి సరళరేఖలుగా దిద్దిన శంకర్ రెడ్డి సార్
సాంఘిక బాధ్యతలేని మాకు హక్కులను విధులను తెలియజెప్పిన సుబ్బరాయుడు సార్
గమ్యములేని మాకు లెక్కలు చెప్పి దారితప్పిన మా లెక్కలను సరిచేసిన సుభాష్ సార్
రసాయనముతో పాటు భవిష్యత్ సమీకరణములను విపులీకరించిన రఘురాం సార్
ఆంగ్ల భాషా వ్యాకరణముతో పాటు ఉచ్చారణను విశదీకరించిన ప్రభాకర్ రావు సార్
హిందీ నేర్పడమే కాక ప్రాథమిక మాధ్యమికలోను ప్రోత్సహించిన జబ్బార్ సార్
చంచలమైన మా మదిలో చందస్సులను సంధీకరించిన తెలుగు వెలుగు ప్రసాద్ సార్
గణితముతో పాటు గుణితములను చెప్పి మాలో సుగుణములను ద్విగుణీకరించిన శివప్రసాద్ సార్
ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తింపబడిన ప్రదానోపాధ్యాయులు తిరుపాలయ్య సార్
“సార్” చిత్ర ప్రేరణతో మా ఉపాధ్యాయులనందరినీ గుర్తుచేసుకుంటూ
- Penned by Sreeni (S. Anil Kumar)
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్