అప్పు
ఏ దివి నుండి వాలిన రాజ కుమారుడివో
ఈ పృథ్విని పునీతము చేసిన పరమాత్మవో
నలువది ఐదు పాఠశాలలకు విద్యాదాతవో
పంతొమ్మిది గోశాలల రక్షణకు ధర్మదాతవో
పద్దెనిమిది వందల మందికి విద్యా ప్రదాతవో
ఇరవైఆరు అనాధ ఆశ్రమాల సంస్థాపకుడివో
పదహారు వృద్ధ ఆశ్రమాల వ్యవస్థాపకుడివో
శక్తిధామ సంక్షేమ కేంద్రములో స్త్రీ సంరక్షకుడివో
ఎల్లలు దాటెను నీ సేవాగుణము అంజనీపుత్రా
ఏమని వర్ణించేను నీమనస్సును నటసార్వభౌమా
ఏమిచ్చి తీర్చినా తరగనిదీ కరగనిదీ నీ అప్పు
ఏడుకొండల వెంకన్నా ఎందుకని తీసుకెల్తివో చెప్పు
ఏ రూపంలోనైనా తిరిగి పంపించవా మా అప్పు
మన “అప్పు” శ్రీ పునీత్ రాజ్ కుమార్ గారికి అశ్రునివాళితో
- Penned by Sreeni (S. Anil Kumar)