రంగవల్లిక

“అనిత”- రమా

శ్రీ రమా పరంధాములు చిలికిన పాలసంద్రపు అమృత జనితవో
శ్రీనాధ కవి సార్వభౌముడు రచించిన సుగుణాల సుందర కవితవో
శ్రీకాంతులు విరివిగా విరచించిన మా ఇంటి గారాల వనితవో 
ఆరని జ్ఞాపకాల జ్వాలలో అమరమైన మరో విషాద చరితవో
అంతులేని విషాద కలగా మిగిలిన నా ప్రియ సోదరి అనితవో 

మూడు ముళ్ళ బంధమే మూడునాళ్ళ ముచ్చట అయ్యేనా
ఏడడుగుల ముచ్చటే ఆరని ఏడుపుల ముంగిట నిలిపేనా
శ్రీనివాస కళ్యాణమే తిరిగి చేరుకోలేని పైవాసము చేర్చేనా
ఏడుకొండల సాక్షిగా నీకు ఆరడుగుల లోతును చూపేనా
అత్తింటి గడపే నీ పుట్టింట గంపెడు దుఖాన్ని నింపేనా

అనితర మా ప్రేమ దీపిక అయ్యేనా అగ్నికి ఆహుతిగా 
ఆపతరమా కన్నీట మండుతున్న మా భడభాగ్ని చితిని
మా తరమా దాటగలడం ఈ అనురాగపు భస్మ స్థితిని 
అనితరం అనిలం మన ఈ అన్నాచెల్లెల్ల రక్షా బంధం
అని తరచి తరచి తలచి తలచి చెదిరెను ప్రేమ జ్ఞాపకం
చలించి జ్వలించి మేడుబారెను నా మేడి హృదయం

మా చిన్నమ్మ రమాదేవి గారి కూతురు కీ శే అనితకు అశ్రు నివాళితో

              -  Penned by Sreeni (S. Anil Kumar)