రంగవల్లిక

ఒక్క అడుగు

అడుగు అడుగు అడుగు గడప దాటి అడుగు తీసి అడుగు వేయి నీ ముందడుగు

రాజధాని నుంచి కడప దాక అడుగు అడుగునా మడిగిన అవినీతిని ప్రశ్నించే తొలి అడుగు

ఉచిత పధక గాఢ అంధకారమున మగ్గుతున్న సీమాంద్రుని నిద్రలేపి వెలుతురులో అడుగు

అడుగు అడుగునా దారి పొడుగునా విస్తరించిన అధికారపు అహంకారాన్ని ఎదిరించే ఎదురడుగు

నమస్కారానికి ప్రతి నమస్కారపు కనీసపు సంస్కారాన్ని నేర్పించే చిరు ప్రశ్ననడుగు

పేరు చివర ఉంటేనే పదవి అను కులాధిపత్యజాడ్యాలను ధిక్కరించి కడిగివేసే ఆశయాన్నడుగు


కరెన్సీ నోటుతో కొనలేని జన సైన్యపు నిజాయితీ ఓటుతో ఒక స్వచ్చమైన రాజకీయ నిజమునడుగు 

మరో తప్పు దొర్లితే గుండెలవిసేలా విలపించినా తిరిగిరాని ఆంద్రరాష్ట్ర పరువుని బ్రతిమాలి అడుగు 

నవరత్నపు హామీలతో మోసపోయిన గుండెల్లో బయటపడని ఉప్పెనలా ఎగసి ఎగసి అడుగు

జగన్మోహన మోహినీ పిశాచక స్కీములలోని స్కాములను స్కానుచేసి వెలికితీసి అడుగు

మనకంటే ముందే రేపటి సమాజము మరణించకూడదను జనచైతన్య జాగృతీకాంతికి వారధిలా అడుగు

చైతన్యము బ్రతికుండగనే ప్రశ్నలేసి జీవించమని నవ్యాంద్రకు బాటలేసే జనసైనిక సారధిలా అడుగు

చూసి చూసి భవిత కూర్చి పారదర్శకతకు ఓటు వేయి చరిత మార్చు మహా ప్రస్ధానపు నీ ఒక్క అడుగు


       -  Penned by Sreeni (S. Anil Kumar)