రంగవల్లిక

శ్రీ నివాసం

 నా హృదయపు గర్భగుడిలో వెలసిన నా తండ్రి శ్రీనివాసుడా

నీ హృదయపు ఆకాశమున నాపైన కురిపించిన ప్రేమ మేఘములే

ద్రవీకరించి చినుకులా రాలిన తరగని అమృత వర్షపు జల్లులుగా

నను పలకరించి మేను పులకరించిన ఈ గృహ ప్రవేశ వేళలో

అడుగు అడుగునా దారి పొడుగునా నీ కొలువు తీరిన గడపలపై

శ్రీకారము దిద్ది వేయనా తొలి అడుగు నా స్వామి నీ దివ్య శ్రీనివాసములో 

దీవించు తండ్రీ నా తొలకరి శ్రీవారి మెట్టు - “శ్రీ నివాసము” ను