రంగవల్లిక

నేనే అంబానీ


పెట్రోలు టాక్స్ లేకుంటే నేనే అంబానీ అని కలలుగంటున్న అమాయకప

పన్నులన్ని కట్టి పండ్లు ఊడగొట్టుకొట్టుకొంటున్న మద్యతరగతి భాగోతమా

కసాయి పన్నుల కషాయము మింగుతున్న కాషాయ భారతమా

కరుణలేని ప్రభుత్వపు విధివిధానాల నలుగుతున్న జీవన మరణ మృదంగమా

మార్పు కోరుతుంది ప్రజానీకం, తీర్పు ఇవ్వబోతుంది జనసైన్యం

ప్రజాగ్రహమున పుట్టిందీ గాజు గ్లాసు


చట్టాలన్నీ ధనికుల చుట్టాలుగ మారుతుంటే

రాజ్యాంగము పాలిస్తున్న రాజులకే మంచి చేస్తుంటే

ఏ1 ఏ2 లే పరిపాలించే ముఖ్యమంత్రులవుతుంటే

ముఖ్యమంత్రి పదవి వారసుల హెరిటేజుగా మారుతుంటే

ఈ నకీలు సాబులను వాకబు చేసే వకీలుసాబు

మనీ పవర్ ని సవాలు చేసే పవర్ స్టారు