ఆచార్య "చిరంజీవి"
ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న సూత్రానికే చిరునామా చిరంజీవి
బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి గీసిన అందాల చిత్రమే చిరంజీవి
చిరు మానవ జీవితంలో చిరకాలపు చరిత్ర రాసిన చిత్ర విచిత్రమే చిరంజీవి
అభిమాన ఆంద్రకోటికి ఆ శివ శంకరుడిచ్చిన వర ప్రసాదమే చిరంజీవి
చిరు మమతతో లక్షల మందికి రక్త దానం చేసిన యూనివర్సల్ బ్లడ్ బ్యాంక్ చిరంజీవి
చిరునవ్వు చిందించే కళ్ళతో కొన్ని వేల కళ్ళు తెరిపించిన పర్సనల్ ఐ బ్యాంక్ చిరంజీవి
చిరు సాయంతో కరోనాను ఎదురించే ధైర్యాన్ని అందించిన ఆక్సిజన్ బ్యాంక్ చిరంజీవి
చిరు హాస్యం చిరు నృత్యం చిరు నటనతో సంపాదించిన అభిమాన కోటి బ్యాంక్ చిరంజీవి
శ్రీశ్రీ మహా ప్రస్ధానపు అడుగులలో ఎందరో బడుగులకి ఊపిరిపోసిన ఆపద్భాందవుడు చిరంజీవి
స్వయంకృషితో విజేతగా నిలిచి వెండితెరపు ఆలయ శిఖరమెక్కిన తెలుగుజాతి మగధీరుడు చిరంజీవి
హీరో టు సుప్రీమ్ హీరో టు మెగా స్టార్ గా అంచలంచలుగా ఎదిగిన భరతమాత పద్మ భూషణుడు చిరంజీవి
తన జీవితమే పాఠముగా ఒదిగి ఎదగాలన్న గుణపాఠాలు నేర్పించిన సినీ మెగా ఆచార్యుడు చిరంజీవి
- Penned by Sreeni (S. Anil Kumar)
0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్